సజావు ఎన్నికలకు పార్టీలు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

సజావు ఎన్నికలకు పార్టీలు సహకరించాలి

Jan 6 2026 1:56 PM | Updated on Jan 6 2026 1:56 PM

సజావు ఎన్నికలకు పార్టీలు సహకరించాలి

సజావు ఎన్నికలకు పార్టీలు సహకరించాలి

జహీరాబాద్‌ టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీ లు సహకరించాలని తహసీల్దార్‌ దశరథ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సత్య ప్రణవ్‌ కోరారు. మున్సిపల్‌ సమావేశ మందిరంలో సోమ వారం వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, తదితర కీలక అంశాలపై రాజకీ య పార్టీలతో చర్చించారు. వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు,ఫిర్యాదులను స్వీకరించారు. ఈ నెల 10న తుది జాబితాను విడుదల చేస్తామని చెప్పారు.

డ్రగ్స్‌ పట్టివేత

జహీరాబాద్‌ టౌన్‌: మండలంలోని రాష్ట్ర సరిహద్దులో గల చెక్‌పోస్టు వద్ద సోమవారం ఎండీఎంఏ డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు ఎకై ్సజ్‌ శాఖ అధికారులు తెలిపారు. వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్‌రెడ్డి వద్ద 0.42 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ లభించిందన్నారు. మరో రెండు వాహనాల్లో 22 లీటర్ల మద్యం బాటిళ్లు దొరి కాయి. కాగా వాటిని తీసుకొస్తున్న రమేశ్‌, జగదీశ్‌ను అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి జహీరాబాద్‌ ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈమేరకు అబ్కారీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రేపు జహీరాబాద్‌లో జాబ్‌ మేళా

జహీరాబాద్‌ టౌన్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈ నెల 7న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఐకేపీ ఏపీఎం విశ్వేశర్‌గౌడ్‌ తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే జాబ్‌ మేళాలో పట్టణ సమీపంలోని మహీంద్ర అండ్‌ మహీంద్ర కంపెనీ ప్రతినిధులు హాజరవుతారన్నారు. టెన్త్‌, ఐటీఐ, ఇంటర్‌ చదివిన 25 సంవత్సరాల వయసు కల్గిన యువతీ యువకులు అర్హులన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement