ప్రతిభ చాటి.. పతకాలు సాధించి..
దుబ్బాకటౌన్: హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీల్లో దుబ్బాక విద్యార్థులు ప్రతిభ చాటారని కరాటే మాస్టర్ శ్రీకాంత్ తెలిపారు. దాదాపు రెండు వేల మంది పాల్గొన్న ఈ జాతీయ స్థాయి పోటీల్లో ఐదుగురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా సత్తా చాటిన విద్యార్థులను, మాస్టర్ శ్రీకాంత్‌ను సినీ హీరో ఇంద్రసేన అభినందించి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులను తల్లిండ్రులు, స్థానికులు ప్రశంసించారు.
కరాటేలో సత్తా చాటిన విద్యార్థులు
హుస్నాబాద్: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హు స్నాబాద్‌కు చెందిన పలు పాఠశాలల విద్యార్థులు ప్రతిభ సాధించి పతకాలు సాధించారు. సోమవా రం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రతిభ సాధించిన విద్యార్థులను ఎంఈఓ బండారి మనీల అభినందించారు. ఈ నెల 4న వరంగల్ జిల్లా పరకాలలో నిర్వహించిన పోటీల్లో హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాల, బీసీ హాస్టల్, మోడల్ స్కూల్ విద్యార్థులు కరాటే విభాగాల్లో ప్రతిభ సాధించి పతకాలు సాధించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం వాసుదేవరెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్, కరాటే మాస్టర్ రాజు, ఉపాధ్యాయులు ఉన్నారు.
ప్రతిభ చాటి.. పతకాలు సాధించి..


