శాస్త్రవేత్తల సలహాలు తప్పనిసరిగా పాటించాలి | - | Sakshi
Sakshi News home page

శాస్త్రవేత్తల సలహాలు తప్పనిసరిగా పాటించాలి

Jan 6 2026 1:56 PM | Updated on Jan 6 2026 1:56 PM

శాస్త్రవేత్తల సలహాలు తప్పనిసరిగా పాటించాలి

శాస్త్రవేత్తల సలహాలు తప్పనిసరిగా పాటించాలి

డాక్టర్‌.ఆర్‌.ఉమారెడ్డి

డాక్టర్‌.ఆర్‌.ఉమారెడ్డి

సంగారెడ్డి టౌన్‌: రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహా లు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ మండలం సహాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ ఉమా రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డిలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పరిశోధన ఫలితాలు విస్తృతంగా ఉన్నాయని, విస్తరణ కార్యక్రమా ల అభివృద్ధి మన జిల్లాలో రైతులకు ఎలా అమలు అవుతున్నాయో క్లుప్తంగా వివరించారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వానాకాలం, యాసంగి సంబంధించిన క్షేత్ర పరిశీలనకు సంబంధించిన వ్యవసాయ సాంకేతిక కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, నాణ్యమైన విత్తనం రైతన్న కు నేస్తం వంటివి పవర్‌ పాయింట్‌ ద్వారా అధికారుల సమక్షంలో రైతులకు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివకుమార్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వర్‌, యూనివర్సిటీ ప్రత్యేక అధికారి వసంత, శాస్త్రవేత్తలు కె.రాహుల్‌, విశ్వకర్మ, డా. నిర్మల. డా. అరుణ, డా.పల్లవి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement