విద్యార్థులను వేధిస్తే ఉపేక్షించం
కల్హేర్(నారాయణఖేడ్): హాస్టల్ విద్యార్థులను వేధింపులకు గురిచేస్తే ఊపేక్షించేదిలేదని ఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి స్పష్టం చేశారు. సిర్గాపూర్‌లో ఎస్సీ బాలుర హస్టల్‌ను ఆదివారం సందర్శించారు. హాస్టల్ వార్డెన్ కిషన్ వేధింపులు, కరెంట్ సమస్య, వసతులలేమితో విద్యార్థులు చీకట్లో రోడ్డెక్కి ధర్నా చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్‌లో కిచెన్, పరిసరాలు పరిశీలించారు. హాస్టల్‌ను ఎప్పటికి సందర్శించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షించాలని ఏఎస్‌డబ్ల్యూఓ చంద శ్రీనివాస్‌కు ఆదేశించారు. కాస్మెటిక్ చార్జీలు, ఇతర సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట ఇన్‌చార్జి వార్డెన్ సంతోష్, నాయకులు యాదవరెడ్డి, పీరప్ప, కల్యాణ్‌రావు పాల్గొన్నారు.
సిర్గాపూర్‌లో ఎస్సీ బాలుర హాస్టల్
సందర్శనలో ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి


