నిబంధనలు
అతిక్రమిస్తే చర్యలు తప్పవు
ఎస్‌ఐ శంకర్
అల్లాదుర్గం(మెదక్): సంక్రాంతి పండగను పురస్కరించుకుని పతంగులు ఎగురవేయడానికి చైనా మాంజా విక్రయించిన, వాడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ శంకర్ హెచ్చరించారు. ఆదివారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ.. చైనా మాంజా అత్యంత ప్రమాదకరమన్నారు. పతంగులు ఎగురవేయడంతో మాంజా దారం తాకి మనుషులు, పక్షులు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని వివరించారు. మాంజాను వాడటం ప్రభుత్వం నిషేధించిందని ఎవరైనా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మాంజాను నిల్వ చేసినా, రవాణా చేసినా, తయారు చేసినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాయన్నారు. కేసుల్లో బీఏఎస్ సెక్షన్ 223, 125తో పాటు, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 5, 15 కింద కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.


