125
కాదు..
● ఉపాధి పని దినాలు పెంపు ● హర్షం వ్యక్తం చేస్తున్న కూలీలు
రామాయంపేట(మెదక్): గ్రామీణ ప్రాంతాల్లో కూలీల జీవనోపాధి భద్రతను పెంచడానికి కేంద్రం ఎప్పటికప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకం కూలీల పని దినాల సంఖ్యను వంద నుంచి 125 రోజులకు పెంచింది. వ్యవసాయ పనులు లేని రోజుల్లో పనులు కొనసాగించే విషయంలోనూ కొన్ని మార్పులు చేసింది. పెంచిన పని దినాలతో కూలీలకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. కాగా పని చేసిన కాలానికి 15 రోజుల్లో కూలీ డబ్బులు వారి ఖాతాల్లో జమకానున్నాయి.
పెరిగిన ఉపాధి కూలీ
జిల్లా పరిధిలో 492 పంచాయతీలకు గాను లక్షా 63 వేల జాబ్ కార్డులున్నాయి. కూలీల సంఖ్య 3.22 లక్షలు. ఈమేరకు ఇటీవల కూలీలకు చెల్లిస్లున్న రేట్లను కేంద్రం సవరించింది. గతంలో గరిష్టంగా ఒక్కో కూలీకి రూ. 272 చెల్లించేవారు. ప్రస్తుతం అది రూ. 300కు పెరిగింది. ముఖ్యంగా వేసవిలో పనులు దొరకని పరిస్థితుల్లో ఉపాధి పనులతో కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. పంట పొలాల వద్దకు మట్టి రోడ్డు నిర్మాణం, బండరాళ్ల తొలగింపు, పంట చేలల్లో ఇసుక మేటలు తొలగించడం, పశువుల షెడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలు, భూమి చదును లాంటి పనులు చేపడుతున్నారు.
ఏప్రిల్ 1 నుంచి అమలు
ఉపాధి పథకంలో భాగంగా వచ్చే ఏప్రిల్ నుంచి 125 రోజుల పనిదినాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత నెలలో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టగా, అది పాసైంది. వంద రోజుల పనిదినాలను సద్వినియోగం చేసుకున్న కూలీలకు ఇది ఉపయోగం కానుందని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. ఈమేరకు కేంద్రం ఈపథకం పేరును వీబీ– రామ్ జీగా మార్చింది.
100


