పెళ్లి కావడం లేదని..
కౌడిపల్లి(నర్సాపూర్): పెళ్లి కావడంలేదని మనస్తాపంతో సెంట్రింగ్ కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రం కౌడిపల్లిలో చోటు చేసుకుంది. ఆదివారం స్థానిక ఎస్‌ఐ మురళి కథనం ప్రకారం.. కౌడిపల్లి గ్రామానికి చెందిన గోల్కొండ వడ్డెర అంజయ్యకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. పెద్దకొడుకు ప్రశాంత్(26), సెంట్రింగ్ పని చేస్తున్నాడు. పెళ్లి చేయాలని పలుమార్లు కోరిన కావడంలేదు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరులేని సమయంలో ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబ సభ్యులకు వాట్సాప్‌లో పెట్టి ఉరేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు వచ్చి బాధితుడిని చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలిపారు. మృతుడి తమ్ముడు ప్రవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. గతంలో రెండుసార్లు ఆత్మహత్యయత్నం చేయగా కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు అడ్డుకున్నారు.
దేవక్కపల్లెలో
బెజ్జంకి(సిద్దిపేట): ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని దేవక్కపల్లెలో చోటుచేసుకుంది. పోలీసులుతెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోరుపాక మల్లయ్య చిన్న కుమారుడు అమర్ (21) చదువుకోకుండా ప్రేమ అంటూ తిరుగుతూ మానసిక వేదనకు గురయ్యాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం అంబెలున్సులో కరీంనగర్ అస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సౌజన్య తెలిపారు.
నీట మునిగి వ్యక్తి మృతి
హవేళిఘణాపూర్(మెదక్): చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీట మునిగి మృతి చెందిన సంఘటన మండల పరిధి శమ్నాపూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. దూరబోయిన నర్సింలు(45), ఆదివారం ఉదయం రౌతుకుంటలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు వల కాలుకు తట్టుకొని నీటమునిగి మృతి చెందాడు. ఉదయం వెళ్లిన నర్సింలు ఇంటికి రాకపోవడంతో కుంట వద్దకు వెళ్లి చూడగా శవమై కనిపించినట్లు కుటుంబీకులు తెలిపారు. సంఘటన స్థలాన్ని హవేళిఘణాపూర్ పోలీసులు సందర్శించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ఎల్లవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
పెళ్లి కావడం లేదని..
పెళ్లి కావడం లేదని..


