ఆప్యాయంగా పకలరిస్తూ.. టీ తాగుతూ
కోహెడరూరల్(హుస్నాబాద్): రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా సామాన్యులతో మమేకం కావడంలోనే తృప్తి ఉంటుంది. సీపీఐ జాతీయ కార్యదర్శి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి ఆదివారం కరీంనగర్ సీపీఐ వంద సంవత్సరాల ఉత్సావాల బహిరంగ సభను ముగించుకుని తిరిగి వస్తుండగా మండలంలోని శనిగరం గ్రామ సమీపంలో అయన టీ కొట్టు వద్ద ఆగి చిరువ్యాపారులతో మూచ్చటించి టీ తాగారు. ఆయన వెంట సీపీఐ నాయకులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మారుపాక అనిల్, పల్లె నర్సింహ,కనుకుంట్ల శంకర్,అందే అశోక్ తదితరులు ఉన్నారు.
ఇసుక టిప్పర్లు సీజ్
పాపన్నపేట(మెదక్)/హవేళిఘణాపూర్: మెదక్ మండలం హల్దీ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు టిప్పర్లను సీజ్ చేసినట్లు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మెదక్ శివారు ప్రాంతంలోని హల్దీ వాగు నుంచి జహీరాబాద్‌కు మూడు టిప్పర్లలో ఇసుక తరలిస్తుండగా, విజిలెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు పాపన్నపేట వద్ద, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్వామి వాటిని సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అలాగే మెదక్ మండల పరిధిలోని సంగాయిగూడ తండా నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఒక టిప్పర్, రెండు హిటాచీలను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు మెదక్ రూరల్ ఏఎస్‌ఐ దయానంద్ తెలిపారు.
సీజ్ చేసిన ఇసుక టిప్పర్లు
ఆప్యాయంగా పకలరిస్తూ.. టీ తాగుతూ


