రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం పోలీసుల కథనం ప్రకారం.. మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ గ్రామానికి చెందిన పాలేటి వెంకటేశ్(49), మేసీ్త్ర పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. శనివారం పనులకు వెళ్లి టీవీఎస్‌పై ఇంటికి వస్తున్న క్రమంలో కాళ్లకల్ శివారులో సాగర్ ఏషియా పరిశ్రమ వద్ద జాతీయ రహదారిపై మేడ్చల్ వైపు నుంచి నిజామాబాద్ వెళ్తున్న కంటెనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు.
రామచంద్రాపురం పట్టణంలో జిమ్‌కోచ్..
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఓ జిమ్‌కోచ్ మృతి చెందిన సంఘటన రామచంద్రాపురం పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భారతినగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీలో నివాసం ఉంటున్న ఉమామహేశ్వరి(25) బీరంగూడలోని ఓ జిమ్‌లో కోచ్‌గా పని చేస్తుంది ఆదివారం తన స్కూటీపై జిమ్‌కు వెళ్తుండగా.. బెల్ ఆర్టీసీ డిపో రోడ్డులో ఏలూరు డిపోకు చెందిన బస్సు స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉమామహేశ్వరి అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


