స్థిత ప్రజ్ఞత.. వివేకవంతుడి లక్షణం
హరేరామ హరేకృష్ణ ఆలయ నిర్వాహకుడు గోకులేష్ ప్రభూజీ
జహీరాబాద్: స్థిత ప్రజ్ఞత కలిగి ఉండడమే వివేకవంతుడి లక్షణమని కందిలోని హరేరామ హరేకృష్ణ ఆలయ నిర్వాహకుడు గోకులేష్ ప్రభూజీ అన్నారు. ఆదివారం స్థానిక పట్టణంలోని మహీంద్రకాలనీలో ఉన్న గోదా సమేత వెంకటేశ్వర ఆలయంలో 188వ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సత్సంగ్ సమావేశంలో ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో మంచి, చెడు ఏదో ఒకటి తప్పని సరిగా జరుగుతుందన్నారు. ఈ పరిణామాలతో కలత చెందకపోవడమే ఉత్తమమైన మార్గమన్నారు. అంతకు ముందు కాలనీలో శోభాయాత్ర నిర్వహించారు. అదేవిధంగా హుగ్గెల్లిలో 153వ పల్లె సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు.


