
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు మడూర్ విద్యార్థులు
చిన్నశంకరంపేట(మెదక్): నిర్మల్ జిల్లా కేంద్రంలో జరగనున్న రాష్ట్రస్థాయి యోగా పోటీలకు మండలంలోని మడూర్ జెడ్పీపాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్‌ఎం రవీందర్‌రెడ్డి, పీడీ డాక్టర్ నరేష్ తెలిపారు. చేగుంట మండల కేంద్రంలో యోగాసన స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో 10వ తరగతి విద్యార్థి రాజమల్లు, జూనియర్ విభాగంలో 8వ తరగతి విద్యార్థులు అశ్వంత్, సాయిచందులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికై న ముగ్గురు విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.