
ముందస్తుగా ‘మహమ్మారి’ గుర్తించొచ్చు!
డీప్ లెర్నింగ్ ఆధారిత వ్యవస్థను రూపొందించిన విద్యార్థి
పటాన్‌చెరు: కోవిడ్–19 వంటి మహమ్మారిలను ముందుస్తుగా గుర్తించేలా డీప్ లెర్నింగ్ ఆధారిత ముందస్తు అంచనా వ్యవస్థను గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని పరిశోధక విద్యార్థి రాజేందర్ అభివృద్ధి చేశారు. ‘టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్, డీప్ న్యూరల్ నెట్ వర్కులను ఉపయోగించి కోవిడ్–19 డేటా యొక్క విశ్లేషణాత్మక అధ్యయనాన్ని’ ఆయన విజయవంతంగా పూర్తి చేసినట్లు గణితం, గణాంక విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జునరెడ్డి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ పరిశోధన ఆరోగ్య సంరక్షణ విశ్లేషణల్లో అధునాతన గణన పద్ధతుల పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తోందన్నారు.