ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య

Sep 5 2025 8:35 AM | Updated on Sep 5 2025 8:35 AM

ప్రేమ

ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య

శివ్వంపేట(నర్సాపూర్‌): ప్రేమ విఫలమైందని ఓ యువతి మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాళ్లపల్లి తండాకు చెందిన యువతి సక్కుబాయి(21) ఎంబీఏ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. అయితే ఇంద్రకరణ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నారాయణఖేడ్‌కు చెందిన సుధాకర్‌ అలియాస్‌ సిద్దును ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను చెప్పింది. కుటుంబ సభ్యులు గోత్రాలు పరిశీలించగా.. వరుసకు అన్నా చెల్లెలు అవుతారని మందలించారు. ఆ తర్వాత పది రోజుల క్రితం ఉద్యోగం చేస్తానని తల్లిదండ్రులకు చెప్పగా.. మళ్లీ మందలించారు. దీంతో మనస్థాపం చెందిన యువతి ఈ నెల 1న ఇంట్లో పురుగుల మందు తాగింది. తొలుత నర్సాపూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి బహుదూర్‌పల్లిలోని ఎస్‌వీ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో బుధవారం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందింది. మృతిరాలు తండ్రి కేశ్యనాయక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి తెలిపారు.

అప్పు తీర్చలేక రైతు..

వెల్దుర్తి(తూప్రాన్‌): అప్పులు అధికమవడంతో వాటిని తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలో ని శేరీలకి చెందిన చీకూరి అలియాస్‌ మీర్జపల్లి బాబు (40), శేకమ్మ భార్యాభర్తలు. వీరు గతేడాది ఎకరన్నర భూమితోపాటు ట్రాక్టర్‌ కొనుగోలు చేశారు. అలాగే ఇటీవల కొత్త ఇంటికి ప్లాస్టరింగ్‌ పనులు చేయించడంతో రూ. 20 లక్షల వరకు అప్పులయ్యాయి. దీంతో అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో కొంత భూమిని అమ్మకానికి పెట్టాడు. అయితే ఆ భూమిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అప్పులు ఎలా తీర్చాలోనని కొంతకాలంగా బాబు దిగులు చెందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం మండల శివారులోని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఓ చెట్టు కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి రైతులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించగా.. వారంతా అక్కడికి చేరుకొని బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌ ఏరి యా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.

ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య1
1/1

ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement