
బడులకు రేటింగ్!
స్వచ్ఛ పాఠశాలలకు ప్రోత్సాహం
● ఈనెల 30 వరకు దరఖాస్తులకు గడువు ● ఎంపికై న పాఠశాలలకు నగదు పురస్కారం
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్య, మౌలిక వసతులు కల్పనతో పాటు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన
వాతావరణ పరిస్థితులు కలిగిన పాఠశాలలకు కేంద్రం ప్రోత్సాహం అందించనుంది. ప్రతి ఏడాది స్వచ్ఛ పాఠశాలలకు నగదు పురస్కారాలను అందిస్తుంది.
ఎస్‌హెచ్‌వీఆర్(స్వచ్చ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్) పేరుతో జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష చొప్పున నగదు పురస్కారాలు అందిస్తుంది. ఇందులో భాగంగానే 2025–26 ఏడాదికి గాను పురస్కారాల ఎంపిక కోసం ప్రభుత్వం ఉత్తర్వులు
జారీ చేసింది. ఈ మేరకు ఎస్‌హెచ్‌వీఆర్ యాప్ ద్వారా ఆయా పాఠశాలల
ప్రధానోపాధ్యాయులు ఈనెల 30లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకునే అంశాలపై ఎంఈఓలు, ఆర్‌పీలు సమావేశాలు నిర్వహించి ఉపాధ్యాయులకు
అవగాహన కల్పించారు.
న్యాల్‌కల్(జహీరాబాద్): జిల్లా వ్యాప్తంగా 864 ప్రాథమిక, 187 ప్రాథమికోన్నత, 211 ఉన్నత పాఠశాలలు, 22 కేజీబీవీలు, 10 మోడల్, 109 గురుకుల, సాంఘీక సంక్షేమ తదితర ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటితో పాటు సుమారు 500 వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 3.40లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే ఎస్‌హెచ్‌వీఆర్ యాప్‌లో పాఠశాల వివరాలు నమోదు చేసే అంశాలపై ఎంఈఓలు, శిక్షణ పొందిన ఆర్‌పీలు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.
ఆరు అంశాలు.. అరవై ప్రశ్నలు
యాల్‌లో పాఠశాలకు సంబంధించిన నీటివసతి, మరుగుదొడ్లు, చేతుల శుభ్రత, విద్యార్థుల నడవడిక, కార్యకలాపాలు, నిర్వహణ, ప్రకృతి పర్యావరణం వంటి ఆరు అంశాలకు సంబంధించి అరవై ప్రశ్నలు ఉంటాయి. నీటివసతికి (22 పాయింట్లు)1నుంచి 9 ప్రశ్నలు, మరుగుదొడ్ల వినియోగం (27పాయింట్లు) 10 నుంచి 21 ప్రశ్నలు, చేతులు కడుక్కోవడం(14పాయింట్లు) 22 నుంచి 27 ప్రశ్నలు, కార్యక కలాపాల నిర్వహణ (21పాయింట్లు)28 నుంచి 40 ప్రశ్నలు, ప్రవర్తన సామర్థ్య నిర్మాణం (20పాయింట్లు) 41 నుంచి 49 ప్రశ్నలు, ప్రకృతి పర్యావరణానికి సంబంధించి(21పాయింట్లు) 50 నుంచి 60 ప్రశ్నలకు ఆన్ లైన్‌లో సమాధానాలు ఇవ్వాలి. మొత్తం 125 పాయింట్లు కేటాయింపు ఉంటుంది. పూర్తి సమాచారాన్ని నమోదు చేసి ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
పాఠశాలకు రూ.లక్ష నగదు
పాఠశాలల ఉపాధ్యాయులు నమోదు చేసిన వివరాల ప్రకారం పాయింట్లు కేటాయింపు ఉంటుంది. అందులో అధిక స్టార్స్ వచ్చిన పాఠశాలలను జిల్లా తనిఖీ బృందం సందర్శిస్తుంది. ఇందులో 8 పాఠశాలలను తనిఖీ చేసి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తుంది. అనంతరం రాష్ట్రస్థాయిలో పరిశీలన బృందం పరిశీలించి తుది జాబితాను జాతీయ స్థాయికి పంపిస్తుంది. చివరగా ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష నగదు ప్రొత్సాహక బహుమతిని ప్రభుత్వం అందజేస్తుంది.
యాప్‌లో రిజిస్ట్రేషన్ ఇలా...
ఎస్‌హెచ్‌వీఆర్ యాప్‌ను డౌడ్‌లోడ్ చేసుకొని పాఠశాలలను ఎంచుకున్న తర్వాత సైన్ అప్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాఠశాల యూడైస్ కోడ్‌ను నమోదు చేసి క్యాప్‌చర్‌ను ఎంటర్ చేసి కంటిన్యూను క్లిక్ చేయాలి. దీంతో యూడైస్‌లో యూజర్ ఐడీ(స్యూల్) నమోదు చేసిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. అనంతరం ఓటీసీ సబ్మిటచేసిన వెంటనే పాఠశాలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. చివరగా అన్ని వివరాలు చెక్ చేసుకొని పాస్ వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి.

బడులకు రేటింగ్!

బడులకు రేటింగ్!