
రాష్ట్ర ఉత్తమ పంతులమ్మగా రేఖ
మెదక్‌జోన్: జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 13 ఏళ్లుగా విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న రేఖ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై ంది. 2022లో ఈ పాఠశాలకు ప్రస్తుత ఎమ్మెల్యే రోహిత్‌రావు రూ.60లక్షలు అందించగా.. నూతన గదులు నిర్మించి విద్యార్థులకు విద్యను బోధించారు. దీంతో గతేడాది పదో తరగతి ఫలితాల్లో ఐదుగురు విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు దాతల సహకారంతో ఒక్కో విద్యార్థికి రూ.20వేల చొప్పున ప్రోత్సాహం అందించారు. అలాగే పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని సిద్ర 578 మార్కులు సాధించి కలెక్టర్ చేతుల మీదుగా రూ.10 వేల నగుదు అందుకున్నారు. ప్రతి ఏడాది సైన్స్ ఫెయిర్‌లు నిర్వహించి విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తమ ఉపాధ్యాయుడిగా సాయిలు
పాపన్నపేట(మెదక్): మండల కేంద్రంలోని గాజులగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిసిరి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 27 ఏళ్లుగా విద్యాశాఖలో సేవలతోపాటు సినీ గేయ రచయితగా, విద్యాశాఖ మార్గ దర్శిగా నిరవధిక సేవలందిస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులను పరిపూర్ణ వికాస వంతులుగా తీర్చిదిద్దడానికి చేస్తున్న కృషిని గుర్తించి విద్యాశాఖ ఆయనను రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది.

రాష్ట్ర ఉత్తమ పంతులమ్మగా రేఖ