
పత్తి పంటలో గంజాయి సాగు
● రూ.8.9 లక్షల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం ● నిందితుడి రిమాండ్
వట్‌పల్లి(అందోల్): గుట్టు చప్పుడు కాకుండా పత్తి పంటలో అంతర పంటగా సాగుచేస్తున్న గంజాయి మొక్కలను గురువారం జోగిపేట ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ సాగర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దరఖాస్తుపల్లికి చెందిన కలాలి యాదాగౌడ్ తన వ్యవసాయ పొలంలో అంతర పంటగా గంజాయి సాగుచేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. పత్తి పంటలో ఎకరం పొలంలో సాగు చేస్తున్న 89 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.8.9 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. అనంతరం యాదాగౌడ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎవరైనా అక్రమంగా గంజాయి సాగుచేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐలు విజయ్‌కుమార్, సందీప్, కానిస్టేబుల్స్ ముఖీం, విక్రం, శ్రీధర్, నాగయ్య, కృష్ణ, పాండరీ పాల్గొన్నారు.