
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలోని టీజీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీలో గురువారం స్థానిక భరోసా కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ మహేందర్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ పద్ధతులను ప్రదర్శించారు. ఫిల్లిస్ క్రిస్టల్ మెథడ్ ద్వారా మానసిక శాంతి, అవగాహన పెరుగుతుందని వివరించారు. ఈ పద్ధతులను విద్యార్థులు ప్రతిరోజూ సాధన చేసేలా పీఈటీ టీచర్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలాగే విద్యార్థులకు చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. యువతకు చట్టపరమైన అవగాహన, భద్రతా చర్యలు, మానసిక ఆరోగ్య పద్ధతులపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భరోసా లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ శ్వేత, కౌన్సిలర్ సౌమ్య, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.