
ఆటో ఏర్పాటు చేసి.. హంగులు కల్పించి..
కొండపాక(గజ్వేల్): సిర్సనగండ్లలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రధానోపాధ్యాయుడు జయప్రకాశ్‌రెడ్డి విశేష కృషి చేస్తున్నారు. మరోవైపు తన సొంత ఖర్చులతో పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా విద్యార్థుల రవాణా సౌలభ్యం కోసం ఆటో ఏర్పాటు చేశారు. క్రీడా దుస్తులు, స్వచ్ఛమైన తాగు నీటి ఆర్వో ప్లాంట్, చదువు అర్థం అయ్యేలా ఐఎఫ్‌బి స్క్రీన్ ఎల్‌ఈడీ ప్యానల్, కంప్యూటర్, తరగతి గదుల్లో కార్పెట్లు, పాఠశాలకు అందమైన రంగులు వేయడం వంటి వాటి కోసం సుమారు రూ. 9లక్షలు వెచ్చించారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా సుమారు70 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం 210 మంది విద్యార్థులకు విద్యాభ్యాసం జరుగుతోంది.

ఆటో ఏర్పాటు చేసి.. హంగులు కల్పించి..