
పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
కొండాపూర్(సంగారెడ్డి): విద్యార్థులు బాగా చదివి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండల పరిధిలోని తొగర్‌పల్లి పాఠశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే తొలిమెట్టు పదో తరగతి అని తెలిపారు. ఏ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్లినా పదో తరగతి మార్కులను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారని వివరించారు. వందశాతం ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు సైతం తమ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అనంతరం పక్కనే శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు.
డీఈఓ వెంకటేశ్వర్లు