అటవీ భూమి ఆక్రమణ
అడ్డుకున్న అధికారులు.. వాహనాల స్వాధీనం
శివ్వంపేట(నర్సాపూర్): అటవీ భూమిని కబ్జా చేసేందుకు చదును చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని పిల్లుట్లలో శనివారం చోటు చేసుకుంది. పిల్లుట్ల కంపార పరిధిలో శనివారం పలువురు వ్యక్తులు డోజర్లు, జేసీబీలతో అటవీ భూమిని చదును చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 4 డోజర్లు, 2 జేసీబీలను స్వాధీనం చేసుకుని నర్సాపూర్ అటవీ కార్యాలయానికి తరలించారు. కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ రేంజ్ అధికారి సిద్దిరాంసింగ్ తెలిపారు. సెక్షన్ అధికారులు శ్రీధర్ బాబు, రాజమణి, సాయిరాం, బీట్ ఆఫీసర్లు కుమార్, వెంకటేశ్ ఉన్నారు.


