
డుమ్మాలకు చెక్
8లో
ధూప్‌సింగ్ తండా.. నాలుగు రోజులుగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న గిరిజనులు. వరదతో విలవిల్లాడిన ముంపు బాధితులు.. ఆ పీడకల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. శనివారం సాక్షి పలకరించగా.. వారిలో భయం ఇంకా కనిపించింది. సీన్ కట్ చేస్తే.. తెల్లవారితే వినాయక చవితి.. రాత్రి భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి మొదలైన చినుకులు కొద్దిసేపట్లోనే జడివానగా మారింది. తెల్లవారేలోగా గంగమ్మ వాగు పోటెత్తింది. వరద విజృంభించి తండాను చుట్టుముట్టింది. అనుకోని ఉపద్రవంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చెట్టుకొకరు.. పుట్టకొకరు పరుగులు తీశారు. కరెంట్ లేదు, తిండీ తిప్పలు లేవు.. వాన నీటితోనే కడుపు నింపుకున్నారు. ఆ నరకయాతనను గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అందుబాటులోకి ముఖ హాజరు విధానం
న్యాల్‌కల్(జహీరాబాద్): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు ఇష్టానుసారంగా డుమ్మాలు కొట్టేందుకు వీలు లేకుండా పోయింది. కాలేజీల్లో విద్యార్థుల హాజరు పెంచేందుకు ముఖ హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్) విధానానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా చాలామంది విద్యార్థులు ఉదయం వచ్చి మధ్యాహ్నం డుమ్మా కొట్టడం, మరి కొందరు కళాశాలకు వెళ్తున్నామని చెప్పి కాలేజీకి రాకుండా గైర్హాజరు కావడంలాంటివి చోటు చేసుకుంటుడటంతో హాజరు శాతం తగ్గిపోయి విద్యార్థులే నష్టపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఇంటర్ బోర్డు విద్యార్థుల డుమ్మాలపై దృష్టి సారించి ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని తీసుకొచ్చింది.
ఈనెల 23 నుంచే మొదలైన ఎఫ్‌ఆర్‌ఎస్
జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈనెల 23 నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్)కు ఇంటర్‌బోర్డు శ్రీకారం చుట్టింది. సీజీజీ(సెంటర్ బోర్డు ఫర్ గుడ్ గవర్నెన్స్) సాంకేతిక సహకారంతో ఇంటర్ బోర్డు అధికారులు టీజీబీఐఈ, ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో రిజిస్టర్ విధానం ద్వారా హాజరు తీసుకునేవారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త విధా నం ద్వారా ఉదయం, మధ్యాహ్నాం రెండుసార్లు అధ్యాపకులు మొబైల్ ఫోన్ల ద్వారా విద్యార్థుల హాజరును నమోదు చేస్తున్నారు. విద్యార్థులు ఏ కారణంతోనైనా పాఠశాలకు డుమ్మాకొడితే ఆ సమాచారం విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు సైతం వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు కళాశాలలకు డుమ్మా కొట్టే సమాచారం తల్లిదండ్రులు, అధికారులకు తెలియనుండటం వల్ల డుమ్మాలకు స్వస్తి పలికే అవకాశాలున్నాయి. దీంతో విద్యార్థుల హాజరు పెరడంతోపాటు విద్యాపరంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో 20 కళాశాలలు
జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఆయా కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 4,623 మంది, ద్వితీయ సంవత్సరంలో 3,350 మంది, మొత్తం 7,973 విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. 140 మందికి పైగా బోధన సిబ్బంది ఉండగా, 50కిపైగా బోధనేతర సిబ్బంది ఉన్నారు.