మీ సేవలు భేష్‌: కలెక్టర్‌ హైమావతి | - | Sakshi
Sakshi News home page

మీ సేవలు భేష్‌: కలెక్టర్‌ హైమావతి

Aug 31 2025 8:10 AM | Updated on Aug 31 2025 8:10 AM

మీ సే

మీ సేవలు భేష్‌: కలెక్టర్‌ హైమావతి

సిద్దిపేటరూరల్‌: జిల్లాను గౌరవప్రదమైన స్థానంలో నిలపడంలో హౌసింగ్‌ పీడీ దామోదర్‌రావు, మిషన్‌ భగీరథ ఈఈ గిరిధర్‌ అందించిన సేవలు అమోఘమని కలెక్టర్‌ కె. హైమావతి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో దామోదర్‌రావు, గిరిధర్‌ల పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తాను మొదటగా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం మొదలైందని, దీనిపై ఎప్పటికప్పుడు పీడీతో చర్చించి ముందుకెళ్లానన్నారు. మిషన్‌ భగీరథ సైతం రోజువారీగా ప్రజలకు నీరందించడం అభినందనీయమన్నారు. ఇరువురి శేష జీవితం బాగా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మిషన్‌ భగీరధ ఈఈ గిరిధర్‌ మాట్లాడుతూ నీటి సరాఫరా చేయడంలో అధికారులు బాగా సహకరించారన్నారు. హౌసింగ్‌ పీడి.దామోదర్‌రావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం సక్సెస్‌ చేయడానికి రాత్రివేళల్లో సైతం విధులు నిర్వహించినట్లు తెలిపారు.

కొమురవెల్లి నూతన ఈవోగా అంజనీదేవి

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ నూతన ఈవోగా కె.అంజనీదేవిని నియమిస్తూ దేవాదాయశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కార్యాలయంలో జ్యువెలరీ వెరిఫికేషన్‌ అధికారిగా (అసిెస్టెంట్‌ కమిషనర్‌)గా విధులు నిర్వహిస్తున్న అంజనీదేవికి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇక్కడ ఈవోగా పని చేస్తున్న అన్నపూర్ణ నేటితో పదవీ విరమణ పొందుతున్నారు. సోమవారం నూతన ఈవో బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ

సదాశివపేట(సంగారెడ్డి): పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ శనివారం తనిఖీ చేశారు. ఈ సదర్భంగా పోలీసుల పనితీరు, స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి రికార్డులను తనీఖీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వినాయక నిమజ్జనంలో తీసుకోవాల్సిన భద్రత చర్యల గురించి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదు దారులతో స్నేహంగా వ్యవహరించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు.

నాటు సారా స్వాధీనం

నారాయణఖేడ్‌: నాటు సారాను తయారు చేస్తున్న వ్యక్తిని పట్టుకొని, 16.75లీటర్ల సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్‌ డిస్ట్రిక్‌ టాస్క్‌ఫోర్స్‌ టీం ఎస్‌ఐ హనుమంతు, అనుదీప్‌ వివరాల ప్రకారం... ఖేడ్‌ మండలం శేరి తండాలో కేతావత్‌ హిరామన్‌ ఇంట్లో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం దాడులు చేసి సారాయిని స్వాధీనం చేసుకుని, బట్టిని ధ్వసం చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎకై ్సజ్‌ డీసీ హరికిషన్‌ ఆదేశాల మేరకు దాడులు చేసినట్లు తెలిపారు. సిబ్బంది అంజిరెడ్డి, అరుణ్‌జ్యోతి, రాజేశ్‌ ఉన్నారు.

ఆర్‌ఎంపీ వైద్యుడిపై కేసు

కొండపాక(గజ్వేల్‌): కుకునూరుపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకుడు (ఆర్‌ఎంపీ) వైద్యుడు సుదర్శన్‌పై కేసు నమోదైంది. ఎస్సై శ్రీనివాస్‌ వివరాల ప్రకారం... గ్రామంలో క్లినిక్‌ పేరిట యథేచ్ఛగా ఆస్పత్రి పేరు పెట్టుకొని ప్రాథమిక వైద్య చికిత్సలకు బదులుగా అత్యవసర వైద్యం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే జగదేవ్‌పూర్‌ మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన విద్యార్థి యశ్వంత్‌ డెంగీ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రికి వచ్చాడు. ప్రాథమిక చికిత్స అందించి ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్‌ చేయాలి. కానీ ఆర్‌ఎంపీ వైద్యుడు సుదర్శన్‌ అనుభవ రాహిత్యంతో అత్యవసర వైద్యం చేయడంతో విద్యార్థి మృతి చెందినట్లు కుటుంబీకులు డీఎంహెచ్‌ఓ ధన్‌రాజ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

మీ సేవలు భేష్‌: కలెక్టర్‌ హైమావతి 1
1/1

మీ సేవలు భేష్‌: కలెక్టర్‌ హైమావతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement