
నల్తూర్‌లో నవోదయకు 25 ఎకరాలు: అదనపు కలెక్టర్
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం పట్టణ పరిధిలో శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ మాధురి పర్యటించారు. ఈ సందర్భంగా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని అల్లినగర్ గ్రామం సర్వేనంబర్ 27లో పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రెవెన్యూ అధికారులతో కలిసి జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని నల్తూరు గ్రామంలోనీ సర్వేనంబర్ 159లో నవోదయ పాఠశాల ఏర్పాటుకు 25 ఎకరాలను కేటాయించారు. పరిశీలన రిపోర్టులను కలెక్టర్‌కు నివేదించనున్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు.
త్వరలో సూపర్ స్పెషాలిటీ
ఆస్పత్రి ప్రారంభం
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణంలో సుమారు రూ.300 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని.. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రి అధికారులతో కలిసి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...కార్మికులకు అత్యాధునిక వైద్య చికిత్సలతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారన్నారు. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ నియంత్రణలో 200 పడకలతో ఈ ఆస్పత్రి నిర్వహణ కొనసాగుతుందని తెలిపారు.
ఉత్తీర్ణత పెంచాలి: డీఈఓ
సంగారెడ్డి టౌన్: విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని డీఈవో వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సంగారెడ్డి మండలంలోని కల్పగూర్ ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులు బాగా చదువు కుని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.
వ్యాధులు రాకుండా చర్యలు
జిల్లా కార్మిక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి
న్యాల్‌కల్(జహీరాబాద్): ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ముందుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కార్మిక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు న్యాల్‌కల్‌లోని కేజీబీవీ, బీసీ బాలిక వసతి గృహాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వసతి గృహాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. వసతి గృహాలకు వచ్చే రోడ్డు అధ్వానంగా ఉందని దానిని బాగుచేయించాలని, నీటి సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరారు.
పెన్షన్ విద్రోహ దినంగా
పాటించాలి: టీజీఈ జేఏసీ
సంగారెడ్డి ఎడ్యుకేషన్: వచ్చేనెల 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు పాటించాలని టీజీఈ జేఏసీ ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. అదే రోజు కలెక్టరేట్ ఎదురుగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొనాలని కోరాయి.

నల్తూర్‌లో నవోదయకు 25 ఎకరాలు: అదనపు కలెక్టర్

నల్తూర్‌లో నవోదయకు 25 ఎకరాలు: అదనపు కలెక్టర్

నల్తూర్‌లో నవోదయకు 25 ఎకరాలు: అదనపు కలెక్టర్