
లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ
జహీరాబాద్: మొగుడంపల్లి మండలంలోని మన్నాపూర్‌లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. శుక్రవారం గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్ చలపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేస్తుందన్నారు. ఆధార్‌కార్డుతో పాటు రేషన్ కార్డు ముఖ్యమన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేష్‌కుమార్, ఆర్‌ఐ సిధారెడ్డి, ఏపీఓ గణేష్, కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ అవేల, మాజీ ఎంపీపీ ప్రియాంక, గ్రామస్తులు గుర్నాథ్‌రెడ్డి, గుండన్న, సిద్దప్ప, బాబా పాల్గొన్నారు.