
ఆకట్టుకున్న టీఎల్‌ఎం మేళా
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల కేంద్రంలో శుక్రవారం టీఎల్‌ఎం మేళా నిర్వహించారు. ఈ మేళాకు మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు హాజరై తయారు చేసిన బోధనోపకరణాలను ప్రదర్శించారు. ఈ బోధనోపకరణాలను ఎంఈఓ మారుతి రాథోడ్, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల హెచ్‌ఎంలు పరిశీలించారు. ఇందులో మామిడ్గి, న్యామతాబాద్, ఇబ్రహీంపూర్, శంశల్లాపూర్, రేజింతల్, ముర్తుజాపూర్, చాల్కి, మిర్జాపూర్(ఎన్), మిర్జాపూర్(బి), రేజింతల్(ఉర్దూ మీడియం) తయారు చేసిన బోధనోపకరణాలను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు మెమంటోలు అందజేశారు.