
తాటిపల్లి కేజీబీవీ అభివృద్ధికి కృషి
మునిపల్లి(అందోల్): కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం మండలంలోని ఆయా గ్రామాల్లో పర్యటించిన మంత్రి రాత్రి తాటిపల్లి కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. ఈ మేరకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వెంటనే అదనపు గదులు, డైనింగ్ హాల్, మరుగు దొడ్లు, కిచెన్ రూం, హాలు, ప్లే గ్రౌండ్ వంటి పలు అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. వెంటనే పనులు ప్రారంభించాల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంజయ్య, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ