
ఉద్యమకారుడికి పీహెచ్‌డీ పట్టా
జహీరాబాద్ టౌన్: కోహీర్ మండలంలోని పోతిరెడ్డికి చెందిన బేగరి విష్ణు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విష్ణు ఓయూలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్ అమరేందర్ రెడ్డి పర్యవేక్షణలో ‘సర్వ శిక్ష అభియాన్: ఇంపాక్ట్ ఆన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్’ అనే అంశంపై పరిశోధన చేయడంతో పీహెచ్‌డీ పట్టా లభించింది. ఇటీవల జరిగిన ఓయూ స్నాతకోత్సవంలో గవర్నర్, వీసీ చేతులమీదుగా పట్టా అందుకున్నారు. కాగా, తమ గ్రామానికి చెందిన యువకుడు పీహెచ్‌డీ పట్టా పొందడంపై పోతిరెడ్డిపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.