
కాళ్లు కోల్పోయిన సిద్దిరాములుకు వీల్‌చైర్
చిన్నశంకరంపేట(మెదక్): రెండు కాళ్లు కోల్పోయి నడవలేని స్థితిలో ఉన్న నార్సింగి మండలం శేరిపల్లికి చెందిన చెప్యాల సిద్దిరాములుకు సానీక్ష ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివ గురువారం వీల్‌చైర్ అందజేశారు. ఈ మేరకు బుధవారం సాక్షి పత్రికలో ‘రెండు కాళ్లు కోల్పోయా ఆదుకోండి’ అనే కథనానికి సానీక్ష పౌండేషన్ చైర్మన్ స్పందించారు. అనంతరం ఫౌండేషన్ సభ్యుడు శ్రీకాంత్‌తో కలిసి శేరిపల్లికి చేరుకుని సిద్దిరాములకు వీల్‌చైర్‌ను అందించారు. ఈ వీల్‌చైర్‌ను హైదరాబాద్‌కు చెందిన ఇక్షణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేఘన నండూరి, రాజశేఖర్‌రెడ్డి సహకారంతో అందించినట్లు తెలిపారు.
స్పందించిన ‘సానీక్ష’ ఫౌండేషన్

కాళ్లు కోల్పోయిన సిద్దిరాములుకు వీల్‌చైర్