
చోరీ చేసిన ఇంటికే నిప్పు
రామాయంపేట(మెదక్): ఓ ఇంట్లో చోరీ చేసిన అనంతరం దుండగులు నిప్పు పెట్టిన ఘటన మండలంలోని పర్వతాపూర్‌లో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్‌ఐ బాల్‌రాజు కథ నం మేరకు.. గ్రామానికి చెందిన చంద్రపు విష్ణువర్ధన్‌రెడ్డి కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటుండగా.. పర్వతాపూర్‌లో తన ఇంటికి తాళం వేసి వెళ్లారు. అయితే తెల్లవారు జామున గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి విలువైన వస్తువులు దోచుకున్నారు. అనంతరం ఇంటికి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న విష్ణువర్ధన్‌రెడ్డి ఉదయం గ్రామానికి వచ్చి చూడగా.. ఇంటిలో కొంతభాగం కాలిపోగా విలువైన వస్తువులు సైతం కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు అనుమానంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.