పంటలు నీటపాలు | - | Sakshi
Sakshi News home page

పంటలు నీటపాలు

Aug 21 2025 11:52 AM | Updated on Aug 21 2025 11:52 AM

పంటలు

పంటలు నీటపాలు

భారీ వర్షాలు రైతన్నను ముంచెత్తాయి. ఆగస్టు తొలివారం వరకు పంటలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు రూ.లక్షలాది పెట్టుబడులు పెట్టి కలుపుతీత, ఎరువులను వేసుకున్న దశలో భారీ వర్షాలు దంచికొడుతుండటం తో పంటలు నీటమునిగాయి. ముఖ్యంగా జిల్లాలో వరి, పత్తి, పెసర, మినుము, సోయా తదితర పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో ప్రాథమిక అంచనా వేశారు. పంట నష్టాన్ని మిగిల్చిన వర్షాలకు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ దశలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

– న్యాల్‌కల్‌(జహీరాబాద్‌):

ఏడాది జిల్లాలో 7.50 లక్షలు ఎకరాల్లో పంటలు సాగు కావలసి ఉండగా ఇప్పటివరకు 6,88,50 ఎకరాల్లో పంటలను రైతులు సాగు చేసుకున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా 3,45,954 ఎకరాల్లో పత్తి, 1,21,535 ఎకరాల్లో వరి, 67,556 ఎకరాల్లో సోయా, 73,557 ఎకరాల్లో కంది, 12,071 ఎకరాల్లో పెసర, 9,688 ఎకరాల్లో మినుము సాగు చేసుకోగా మిగిలిన 1,20,000 ఇతర పంటలను రైతులు వేసుకున్నారు.

727 ఎకరాల్లో పంట నష్టం

వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు, ఏఓలు, ఏఈఓలు సేకరిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయా గ్రామాల్లో పర్యటించి 507మంది రైతులకు చెందిన 727 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. వరి, పత్తి, పెసర, మినుము, సోయా తదితర పంటలు దెబ్బతింటున్నట్లు అధికారులు తెలిపారు. అధికంగా అందోల్‌ నియోజకవర్గంలో160 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, జహీరాబాద్‌ ప్రాంతంలో 121 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అధిక శాతం పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటల వివరాల సేకరణ కొనసాగుతుంది. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

నీట మునిగింది

మూడెకరాల్లో పత్తి పంటను వేశాను. కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట నీట మునిగింది. పంట సాగు కోసం చాలా పెట్టుబడి పెట్టాం. ప్రభుత్వం ఆదుకోవాలి.

– విఠల్‌, రైతు–రేజింతల్‌

అధికంగా వరి దెబ్బతింది

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 727 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఎంఏఓలు, ఏఈఓలు పంట నష్టం వివరాలను సేకరిస్తున్నారు. అధికశాతం వరి పంట దెబ్బతిన్నట్లు సమాచారం అందింది.

– శివ ప్రసాద్‌, డీఏఓ,సంగారెడ్డి

రేజింతల్‌ గ్రామ శివారులో నీట మునిగిన పంట

దెబ్బతిన్న పంట రైతులు ఎకరాలు

వరి 205 315

పత్తి 137 198

సోయాబీన్‌ 95 95

పెసర 20 28

మినుము 19 26

కంది 21 25

జొన్న 13 12

మొక్క జొన్న 2 6

కూరగాయలు 8 13.3

మొత్తం 507 727.3

పరిహారం అందించాలని

కోరుతున్న రైతులు

అత్యధికంగా అందోల్‌లో

160 ఎకరాల్లో పంటనష్టం

కలుపు తీసి, ఎరువులు వేసిన

దశలో భారీ వర్షాలు

పంటలు నీటపాలు1
1/1

పంటలు నీటపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement