
యూరియా కొరత సృష్టిస్తే చర్యలు
కల్హేర్(నారాయణఖేడ్)/నారాయణఖేడ్: ఎవరైనా యూరియా కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. నల్లవాగు ప్రాజెక్టును ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమహారతితో కలిసి బుధవారం సందర్శించారు. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం, అలుగుపై నుంచి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు నిర్మాణం, ఆయకట్టు విస్తీర్ణం, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి పంటల సాగు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నల్లవాగు ప్రాజెక్టు వద్ద అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులను సూచించారు. వరద ప్రవాహం కారణంగా ప్రాజెక్టు వద్దకు ఎవ్వరూ రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిర్గాపూర్‌లో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి యూరియా స్టాక్, రికార్డులు పరిశీలించారు. నల్లవాగు గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గురుకులంలో వసతులు, బోధన అంశాలపై ఆరా తీశారు. విద్యార్థులు శ్రద్ధగా చదవాలని చెప్పారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈఈ సుందర్, డీఈఈ పవన్‌కుమార్, సీఐ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ హేమంత్, ప్రిన్సిపాల్ తిరుపతయ్య, ఏఓ హరికృష్ణ పాల్గొన్నారు.
ఆస్పత్రి తనిఖీ
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ఖేడ్ ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధుల బారిన పడిన వారికి తక్షణం వైద్య సేవలు అందిస్తూ అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా ప్రాంతీయ ఆస్పత్రుల సమన్వయకర్త డా.సంగారెడ్డి, ఖేడ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రమేశ్ ఉన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య
నల్లవాగు ప్రాజెక్టు సందర్శన