
పాత మద్యం కొత్తసీసాలో
సంగారెడ్డి జోన్: జిల్లాలో ఏ4 మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు కొనసాగే దుకాణాలకు ఈ అనుమతులు జారీ చేయనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న దుకాణాల లైసెన్సు నవంబర్ 30తో ముగియనుంది. గతంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుము రూ.2 లక్షలు ఉండగా దానిని రూ.3 లక్షలకు పెంచారు. దీంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనుంది. కాగా, తాజా నోటిఫికేషన్‌లో రిజర్వేషన్లు సైతం కేటాయించారు. గౌడ్‌లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% చొప్పున మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.
జనాభా ఆధారంగా ఎకై ్సజ్ పన్ను
రిటైల్ షాపులు చెల్లించే ఎకై ్సజ్ పన్ను 2011 జనాభా లెక్కల ప్రకారం ఉండనుంది. పన్ను చెల్లించే మొత్తంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఐదువేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు, 5,000 నుంచి 50,000 ఉంటే రూ.55 లక్షలు, 50,000 నుంచి లక్ష ఉంటే రూ.60 లక్షలు, ఒక లక్ష నుంచి ఐదు లక్షలు ఉంటే రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షలు ఉంటే రూ.85 లక్షలు, 20 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.1.10కోట్లుగా నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 101 మద్యం దుకాణాలున్నాయి.
మద్యం దుకాణాల లైసెన్స్‌కు
నోటిఫికేషన్
జిల్లాలో 101 మద్యం దుకాణాలు
నవంబర్ నెలతో
దుకాణాల గడువు పూర్తి