
టీఎల్‌ఎంతో అవగాహన సులువు
జోగిపేట(అందోల్): టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌తో విద్యార్థులకు బోధిస్తే పాఠాలు సులభంగా అర్థమవుతాయని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.మాణయ్య పేర్కొన్నారు. అందోలులోని డీఎల్ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం ఏంఈవో బండి కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన టీఎల్‌ఎం మేళాకు మాణయ్య హాజరై మాట్లాడారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధన పరికరాలతో పాఠశాలల్లో విద్యాబోధన చేయాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. ఈ పరికరాలను రూపొందించిన ఉపాధ్యాయులను, జిల్లా స్థాయికి ఎంపికై న ఉపాధ్యాయులను అభినందించారు. 34 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన బోధనాభ్యసన సామగ్రిని ప్రదర్శించారు.
విజేతలు వీరే
ఈ మేళాలో జరిగిన పోటీలో ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయలు విజేతలుగా ఎంపికయ్యా రు. తెలుగులో జె.శాంత కుమారి (బ్రహ్మణపల్లి), అహ్మద్ పాషా (జోగిపేట) ఆంగ్లంలో టి.బాలమణి (పోతిరెడ్డిపల్లి), జి.ఫణీశ్రీ (రాంసన్ పల్లి), గణితంలో టి.దేవదాస్ (కన్‌సాన్‌పల్లి), ఎస్.సంగీత (మన్‌సాన్‌పల్లి), పరిసరాల విజ్ఞానంలో డి.భార్గవి (అ న్నాసాగర్), టి.కల్పన (సాయిబాన్ పెట్), ఉర్దూ మీడియంలో దుర్దన అప్సరి (అందోల్), రహీమ భాను(జోగిపేట) ఎంపికై న వారిలో ఉన్నారు.
పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
ఎ.మాణయ్య
అందోల్‌లో టీఎల్‌ఎం మేళా