
సంగారెడ్డికి మంజీరా నీళ్లు
సంగారెడ్డి: నియోజకవర్గ ప్రజలకు మంజీరా నీళ్లు అందించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులను కోరారు. మంచి నీటి సరఫరాపై మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి బుధవారం రాజంపేట ఫిల్టర్ బెడ్‌ను తనిఖీ చేసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంజీరా నీటి పథకం ప్రారంభించినప్పుడు ఒకేసారి పది ట్యాంక్‌లు నిండి గంటన్నరలోనే నీటి సరఫరా జరిగేదని కానీ, ఇప్పుడెందుకు అలా జరగడం లేదని జగ్గారెడ్డి అధికారులను ప్రశ్నించారు. మిషన్ భగీరథ కోసం సింగూర్ ప్రాజెక్ట్ వద్ద రూ.వంద కోట్లతో ఫిల్టర్‌బెడ్ నిర్మించారని పదేళ్లపాటు ఒకే కాంట్రాక్టర్‌కు నిర్వహణ ఇవ్వగా అతడు సరిగ్గా పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని అధికారులు వివరించారు. మిషన్ భగీరథ ద్వారా కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి 10 ట్యాంక్‌ల ద్వారా మంజీరా నీటి సరఫరా జరిగేందుకు తగిన ప్రణాళికలు, అవసరమైన నిధులకు సంబంధించి బడ్జెట్ రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు.
రాజంపేట ఫిల్టర్ బెడ్‌ను
తనిఖీ చేసిన జగ్గారెడ్డి
నీటి సరఫరాపై అధికారులతో సమీక్ష