
ప్రయాణికులకు మెరుగైన సేవలు
నారాయణఖేడ్: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ఖేడ్ నుంచి నిజామాబాద్‌కు బుధవారం ఆయన నూతన బస్సు సర్వీనును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఖేడ్ ప్రాంతవాసులు వ్యాపార, వాణిజ్య, ఇతర అవసరాల కోసం నిజామాబాద్ ప్రాంతానికి అధికంగా రాకపోకలు సాగిస్తున్నందున వారి సదుపాయం కోసం బస్సుసర్వీసును ఏర్పాటు చేశామన్నారు. అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు ఖేడ్ క్యాంపు కార్యాలయం ఆవరణలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్‌అలీతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానిగా రాజీవ్ చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడుతూ ఆయనచూపిన బాటలో ప్రతిఒక్కరూ పయనించాలన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి