
సాగుపై క్షేత్రస్థాయిలో విద్యార్థుల పరిశీలన
హత్నూర (సంగారెడ్డి): మండలంలోని పన్యాల గ్రామంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ సాగును రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు బుధవారం పరిశీలించారు. గ్రామీణ కృషి అనుభవం కారక్రమంలో భాగంగా విద్యార్థులు వంశీ, మణికంఠ, సాయి శివనాథ్, అనిల్ గ్రామీణ వ్యవసాయ భాగస్వామ్య విశ్లేషణ కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్తలు డా. అరుణ, డా.రాహుల్, డా.నిర్మల పాల్గొన్నారు. విద్యార్థులు గ్రామంలో పర్యటించి రైతులతో మాట్లాడి సమస్యలను తెలు సుకున్నారు. సమస్యలను గ్రామ పటం, చిత్రాల రూపంలో ప్రదర్శించారు. రైతులు టి.బుచ్చి రెడ్డి, డి.విఠల్, బషీర్, శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓ రమేశ్, గ్రామ కార్యదర్శి శ్వేత, స్థానికులు అరుణ్ కాంత్ రెడ్డి, సతీశ్, శంకర్, మల్లారెడ్డి పాల్గొన్నారు.