
అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ లక్ష్యం
దుబ్బాకటౌన్: గ్రామాల్లో ఉండే ప్రజలందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమం చేపట్టిందని ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉల్లాస్ శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా చేసేందుకు వాలంటరీ టీచర్లను ఎంపిక చేస్తామన్నారు. ఈ నెల 23న వాలంటరీ టీచర్లకు గ్రామస్థాయిలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి సెప్టెంబర్ 8న ఉల్లాస్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తామని తెలిపారు. ఉల్లాస్ ముఖ్య ఉద్దేశం 2030 వరకు భారతదేశంలో నిరక్షరాస్యులు లేకుండా 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి, ఆర్పీలు, ఉపాధ్యాయులు, వీవోఏలు తదితరులున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా
డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి