
ఖాజీపేట తండాకు రాకపోకలు బంద్
నర్సాపూర్ రూరల్: మండలంలోని ఖాజీపేట గిరిజన తండాకు ఐదో రోజులుగా రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాలతో తండాకు వెల్లే మట్టిరోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. రెడ్డిపల్లి – ఖాజీపేట టీడబ్ల్యూ రోడ్డు నుంచి గిరిజన తండా వరకు సుమారు మూడు కిలోమీటర్లు మట్టి రోడ్డు ఉంది. ఈ రోడ్డు పక్క నుండి కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ ఉండటంతో పాటు మరోపక్క వాగు ఉండటంతో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు కోతలకు గురైంది. దీంతో స్కూల్ పిల్లలతో పాటు గిరిజనులు నిత్యావసర సరుకులు, ఆస్పత్రులకు వెళ్లాలంటే నరకయాతన పడుతున్నారు. కాళేశ్వరం కాలువతోనే తమ రోడ్డు కుంగిపోయి గుంతలు ఏర్పడుతున్నాయని తండా గిరిజనలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కాలేశ్వరం ఏఈ డబ్ల్యూఓ సుజాతరాణిని వివరణ కోరగా తండా రోడ్డుకు మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
వర్షంతో కొట్టుకుపోయిన మట్టి రోడ్డు
ఐదు రోజులుగా గిరిజనులకు ఇబ్బందులు