నూతన చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

నూతన చట్టాలపై అవగాహన అవసరం

Aug 21 2025 11:26 AM | Updated on Aug 21 2025 11:26 AM

నూతన చట్టాలపై అవగాహన అవసరం

నూతన చట్టాలపై అవగాహన అవసరం

సంగారెడ్డి జోన్‌: రిఫ్రెష్మెంట్‌ కోర్సులో భాగంగా జిల్లా నుంచి వచ్చే సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ సూచించారు. బుధవారం జిల్లా పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఆయన సందర్శించి, బ్యారెక్స్‌, తరగతి గదులు, కంప్యూటర్‌ ల్యాబ్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బందికి నాణ్యమైన శిక్షణ అందించేలా నూతన చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. డ్రిల్‌ ప్రాక్టీస్‌, రెగ్యులర్‌ పరేడ్‌లో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఫిజికల్‌ ట్రైనింగ్‌, లా క్లాస్‌లను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీ ప్రిన్సిపాల్‌, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ సురేందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement