
డిజిటల్ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేట ఎడ్యుకేషన్ : జేఈఈ, నీట్, ఈఏపీసెట్ ఎంట్రెన్స్‌లకు హాజరయ్యే విద్యార్థులు ఫిజిక్స్ వాలా ఆన్‌లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. బుధవారం ఆయన ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను సందర్శించి ఆన్‌లైన్ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రోజు వారి తరగతులతో పాటు, ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని అధ్యాపకులను ఆదేశించారు. డిజిటల్ క్లాస్‌లను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.
సిద్దిపేట జిల్లా డీఐఈఓ రవీందర్ రెడ్డి