పురాతన భవనం కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

పురాతన భవనం కూల్చివేత

Aug 21 2025 11:26 AM | Updated on Aug 21 2025 11:26 AM

పురాతన భవనం కూల్చివేత

పురాతన భవనం కూల్చివేత

ఝరాసంగం(జహీరాబాద్‌): మండల కేంద్రంలో సుమారు 150 సంవత్సరాల క్రితం ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయ ఆవరణలో నిర్మించిన పురాతన భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చివేశారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భవనం ఓ పక్క కూలిపోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామపంచాయతీ అధికారుల ఆదేశాలతో భవన యజమాని కూల్చివేత పనులు ప్రారంభించారు. కొన్ని ఏళ్ల పాటు ఓ వైపు కుటుంబం నివాసం ఉండటంతో పాటు అప్పట్లో పోలీస్‌ స్టేషన్‌, ఆ తర్వాత బీసీ సంక్షేమ వసతి గృహం కొనసాగింది. అనంతరం సినిమా ప్రదర్శనలతోపాటు ప్రైవేటు కార్యాలయాలు కొనసాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement