
చేపల వలలో చిక్కిన కొండ చిలువ
నర్సాపూర్ : ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాలకు రాయరావు చెరువు నీటితో నిండుకుండలా ఉంది. మత్స్యకారులు చెరువులో చేపలు పట్టేందుకు వలలు ఏర్పాటు చేసి వేట కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం వల వేసిన కొంత సేపటికి చూడగా కొండ చిలువ చిక్కింది. దీంతో మత్స్యకారులు అటవీ శాఖ రేంజ్ అధికారి అరవింద్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన స్పందించి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రతినిధుల సహకారంతో కొండ చిలువను సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్లు తెలిపారు. అటవీ అధికారి అరవింద్ వెంట సెక్షన్ ఆఫీసర్ సాయిరాం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.