
కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి..
జహీరాబాద్: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చిరాగ్‌పల్లి గ్రామానికి చెందిన సోలాపూర్ రఘు(40) సోమవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం గ్రామం సమీపంలో వెతుకుతుండగా ఎల్లమ్మ బావి దగ్గర బురదలో చెప్పులు కనిపించాయి. అనుమానంతో బావిలో పాతాళ గరిగే సహాయంతో వెతకగా మృతదేహం లభించింది. బావిలో నీటిని తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు పడి మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడికి భార్య మీనాక్షి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
బావిలో పడి వ్యక్తి మృతి