
వర్గల్ క్షేత్ర నిర్వహణ అద్భుతం
కంచి పీఠాధిపతి ప్రశంసలు
వర్గల్(గజ్వేల్): కంచి పీఠం ఆధ్వర్యంలోని వర్గల్ శ్రీవిద్యాధరి క్షేత్ర నిర్వహణ అద్భుతమని కంచి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రశంసించారు. తిరుపతి క్షేత్రంలోని మహా పాదుకా కంచి మఠంలో చతుర్మాస్య దీక్షలో ఉన్న స్వామివారిని మంగళవారం వర్గల్ క్షేత్ర వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో అభివృద్ధి కమిటీ బృందం కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా క్షేత్ర నిర్వహణ, చేపడుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికను స్వామివారికి వివరించారు.