
విపత్తులపై అవగాహన కలిగి ఉండాలి
పటాన్‌చెరు టౌన్: విపత్తులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగం, శ్రీ సత్య సాయి సేవ ఆర్గనైజేషన్ ‘విపత్తు నిర్వహణపై ‘ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... నీరు, భౌగోళిక , మానవ నిర్మిత, జీవ సంబంధిత, పారిశ్రామిక, అను సంబంధిత విపత్తులు మనకు ఏర్పడతాయని, వాటిపట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. విపత్తుల వల్ల జరిగే నష్టాలను పీపీటీ ద్వారా రాష్ట్ర స్థాయి విపత్తు నిర్వహణ కమిటీ ఇన్‌చార్జి శ్రీకృష్ణ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకటేశం, డాక్టర్ కరుణా కుమారితోపాటు అధ్యాపకులు ప్రవీణ, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ యోగిబాబు, డాక్టర్ మల్లిక, డాక్టర్ సుజాత, డాక్టర్ మంజు శ్రీ, డాక్టర్ విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్