
మహిళను కాపాడిన కానిస్టేబుల్
చేర్యాల(సిద్దిపేట): చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కానిస్టేబుల్ కాపాడాడు. ఈ ఘటన పట్టణ శివారులో చోటు చేసుకుంది. కానిస్టేబుల్ స్వామి, స్థానికుల వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన పాక రాణి కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఇంటి నుంచి వచ్చేసి చనిపోదామని చెరువులో దూకింది. అదే సమయంలో కట్టపై మార్నింగ్ వాక్ చేస్తున్న కానిస్టేబుల్ స్వామి వెంటనే చెరువులోకి దూకి ఆమెను కాపాడి మానవత్వం చాటుకున్నాడు. మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ స్వామిని సీపీ అనురాధ, హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ ఎల్.శ్రీను, ఎస్‌ఐ నవీన్, పట్టణ ప్రజలు అభినందించారు. త్వరలో స్వామికి నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు.