
పేకాటరాయుళ్లపై కేసు నమోదు
హత్నూర(సంగారెడ్డి): పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీధర్ రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సోమవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో 14 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. రూ.లక్ష 80 వేల 650 , 13 సెల్‌ఫోన్లు, మూడు కార్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు మోదు చేసి న్యాయస్థానంలో హాజరు పర్చారు.
దాబాలు, రైల్వేస్టేషన్ తనిఖీ
మనోహరాబాద్(తూప్రాన్): ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలోని దాబాలు, రైల్వే స్టేషన్‌లో భద్రతా చర్యల్లో భాగంగా బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ తెలిపారు. మంగళవారం మనోహరాబాద్ రైల్వే స్టేషన్, దాబాల్లో తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడుతూ అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా, వస్తువులు, పార్శిల్ కనిపించినా తమ దృష్టికి తేవాలన్నారు.