
ఇబ్బందులు పడుతున్నాం
ఝరాసంగం నుంచి బర్దీపూర్ చౌరస్తా మీదుగా, ఝరాసంగం నుంచి జహీరాబాద్‌కు ఉన్న రహదారి అధ్వానంగా మారింది. దీంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు మరమ్మతులు చేపట్టకపోవటంతో గుంతలు పెద్దగా మారుతున్నాయి.
–గంగారం, బర్దీపూర్, మం.ఝరాసంగం
ప్రభుత్వానికి నివేదికలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను గుర్తించి, ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే మరమ్మతు పనులు చేపడతాం.
– నర్సింహులు, ఈఈ,
ఆర్ అండ్ బీ, సంగారెడ్డి జిల్లా