
రేపు మంత్రి పర్యటన
మునిపల్లి(అందోల్): ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈనెల 21న మునిపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామాల్లో బీటీ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఏఎంసీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండ అధ్యక్షుడు సతీశ్‌కుమార్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. బుదేరా మహిళా డిగ్రీ కళాశాల, మునిపల్లి మోడల్ స్కూల్‌ను మంత్రి సందర్శిస్తారు. ఖమ్మంపల్లి బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనతోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి పర్యటనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
ప్రమాదస్థాయిలో డబ్బవాగు
మునిపల్లి(అందోల్): ఝరాసంగం మండలం జోనగామ శివారులోని తాటిపల్లి డబ్బవాగు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో బోడపల్లి, పిల్లోడి, తాటిపల్లి, జోనగామ గ్రామాలతోపాటు ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వ్యవ సాయ భూములలో పెట్టిన పంటలను చూసేందుకు వీలులేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. అంతేకాకుండా పత్తి పంటలో నీరు నిలిచిపోవడంతో పంటలు దెబ్బతిన్నాయని, పంటలకు నష్ట పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఉధృతి తగ్గేవరకు రావొద్దు
హెచ్చరిస్తున్న పోలీసులు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ నియోజకవర్గం సజ్జారావు పేట తండా పరిధిలోని జాడిమల్కాపూర్ ఎత్తిపోతల వద్ద జలకళ ఉట్టిపడుతోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పైనుంచి కిందికి దూకుతున్న నీళ్లు సందర్శకులను కనువిందు చేస్తోంది. జలపాతాన్ని చూసేందుకు జహీరాబాద్‌తోపాటు కర్ణాటక రాష్ట్రం నుంచి సందర్శకులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల దగ్గర రోడ్డును మూసివేశారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ప్రమాద హెచ్చరిక బోర్డులను మంగళవారం ఏర్పాటు చేసి సందర్శకులను తిప్పి పంపేస్తున్నారు. వరద ఉధృతి తగ్గేవరకు సందర్శకులు రావద్దని ఎస్‌ఐ కాశీనాథ్ సూచించారు.
పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
పుల్‌కల్(అందోల్): వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని కార్యదర్శులకు డీపీఓ సాయిబాబా సూచించారు. గొంగ్లూర్ గ్రామ పంచాయతీలో మంగళవారం ఆయన పర్యటించి పారిశుద్ధ్య పనులను, పంచాయతీ రికార్డులను పరిశీలించారు. పాత, మట్టి ఇళ్లను గుర్తించి అందులోని వారిని తాత్కాలికంగా ఖాళీ చేయించి వేరే చోట ఆశ్రయం కల్పించాలని సూచించారు.
ఎవరైనా ఇళ్లు ఖాళీ చేయకుంటే పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు. డీపీఓ వెంట ఎంపీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మంజ్రేకర్ ఉన్నారు.
ధర్నాను విజయవంతం
చేయండిః మాణయ్య
జోగిపేట(అందోల్): సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న పీఆర్‌టీయూ తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల మాణయ్య పిలుపునిచ్చారు. జోగిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం మహాధర్నా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాణయ్య మాట్లాడుతూ..పాత పింఛను విధానాన్ని సాధించేందుకు పీఆర్‌టీయూ కట్టుబడి ఉందన్నారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అందోల్ అర్బన్ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరోత్తమ్ కుమార్, జనార్దన్‌గౌడ్, అందోల్ రూరల్ శాఖ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు రాజమల్లు, మయాచారి తదితరులు పాల్గొన్నారు.

రేపు మంత్రి పర్యటన

రేపు మంత్రి పర్యటన