
విద్యతోనే అభివృద్ధి: సంజీవరెడ్డి
నారాయణఖేడ్: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం డీఈఓ వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డిలతో కలిసి నూతన సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అంతకుముందు ఖేడ్ భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల కోసం గుర్తింపు శిబి రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..విద్యార్థులకు థియరీ కన్నా ప్రాక్టికల్స్ సులభంగా అర్థమవుతాయన్నారు. అదేవిధంగా ఖేడ్‌లో సదరం శిబిరం క్యాంపును ఏర్పాటు చేయడానికి కృషిచేస్తామన్నారు. అనంతరం డీఈఓ, సైన్స్ అధికారి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
నల్లవాగు నీటితో నింపుతాం
కల్హేర్ (నారాయణఖేడ్): జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు నల్లవాగు నీటితో చెరువులు నింపుతామని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. మంగళవారం నల్లవాగు ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో వరద ప్రవాహాన్ని పరిశీలించారు. కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లోని చెరువులు నిండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
డీఈఓతో కలిసి సైన్స్ ల్యాబ్ ప్రారంభం